భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.
భూపాలపల్లి , జూలై 30(చక్రవాణి న్యూస్) :
రానున్న రెండు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. జిల్లా యంత్రాంగం ఇప్పటికే పూర్తి స్థాయిలో అప్రమత్తమైందని, గ్రామం నుండి జిల్లా స్థాయి వరకు అధికారులందరూ స్థానికంగా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
ప్రయాణాలు వాయిదా: అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుండి బయటకు రావొద్దు.
జాగ్రత్తలు తప్పనిసరి: ఒకవేళ బయటకు రావలసి వస్తే తగిన రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలి.
జలాశయాలకు దూరంగా: వాగులు, వంకలు, చెరువులు, కల్వర్టుల వద్దకు అస్సలు వెళ్లకూడదు.
లోతట్టు ప్రాంతాలు: లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందస్తుగా ప్రత్యేక జాగ్రత్తలు వహించాలి.
రహదారుల మూసివేత: రహదారులపై నీరు ప్రవహిస్తున్నట్లయితే రవాణా నిలిపివేసి, వెంటనే బారికేడ్లు ఏర్పాటు చేయాలి.
పశువుల సంరక్షణ: వర్షాల తీవ్రత దృష్ట్యా పశువుల సంరక్షణకు సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టాలి.
24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు : ప్రజల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యత అని, అత్యవసర పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించడానికి కలెక్టరేట్‌లో 9030632608 నంబరుతో 24 గంటల ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

0 Comments